అమరావతి: చంద్రబాబు దగ్గర తీసుకున్న రెమ్యునరేషన్‌కు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్ షా చెప్పి ఉంటారని, అందుకే అమిత్ షా కరెక్ట్ అని పవన్ అంటున్నాడని నాని ఎద్దేవా చేశారు. అమిత్ షా ను, మోదీని పొగిడితే ఎవరు జైలుకు వెళ్లరన్నారు. సినిమాల్లో నిర్మాతకు పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఇస్తే.. రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుకి ఇస్తారని మండిపడ్డారు. నీకు రెమ్యూనరేషన్ ఇచ్చి, కాల్ షీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని మాత్రమే పొగుడుతావని నాని దుయ్యబట్టారు. పూటకో మాట మాట్లాడటం పవన్‌కి అలవాటగా మారింది. 'చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ మతానికి దగ్గరగా పెరిగానని, అందుకే ప్రజాసేవ చేయడానికి వచ్చానని, ఇప్పుడు హిందూ మతంపై విషం చిమ్ముతున్నాడు' అని నాని తీవ్రంగా మంత్రి నాని మండిపడ్డారు.
రెమ్యూనరేషన్ కోసమే పవన్ విమర్శలు!